Home నల్లగొండ వైద్యుల్లేక బాత్రూంలోనే ప్రసవం

వైద్యుల్లేక బాత్రూంలోనే ప్రసవం

కవలలు జననం, వైద్య సాయం లేక ఒకరు మృతి
ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణీకి ఎదురైన దుర్గతి ఇది

Birth

దేవరకొండ : ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్లు లేకపోవడంతో ఓ నిండు గర్భిణీ ఆసుపత్రి బాత్రూంలోనే ప్రసవమైన ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో చోటుచేసుకుంది. పిఎ పల్లి మండలం, నంబాపురం తండాకు చెందిన కృష్ణ, కవిత దంపతులు. కవిత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను శుక్రవారం తెల్లవారు జామున దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అం దుబాటులో లేకపోవడంతో ఆమెకు ప్రసవం చేయలేదు. పురిటి నొప్పులు ఎక్కువై ఆసుపత్రి బాత్రూంలోనే మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డను ప్రసవించే సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉండగా, ఆసుపత్రిలో ఆన్‌టైం డ్యూటీ డాక్టర్లు, సిస్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే రెండు బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని కవిత బంధువులు ఆరోపించారు. గుర్భిణీగా ఉన్న సమయంలో ఇదే ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలు చేయించుకుందని, పరీక్షల్లో కడుపులో కవలలు ఉన్నట్లు తేలగా, వారిద్దరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారన్నారు. కానీ, ప్రసవ సమయంలో రెండవ బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.