Home ఆఫ్ బీట్ మహిళలు ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటున్నారా?

మహిళలు ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటున్నారా?

lf

ఇటీవల మహిళలకు ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ పెరిగింది. అల్పాహారం తినేముందు కొద్దిగా ఆలోచించి బలమైన ఆహారం సేవిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. తాజాపళ్లు, బాదం, కిస్మిస్ లాంటివి తినటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏదిపడితే అది తినటంలేదు. అన్నం వేడిగా హాట్‌పాక్‌లో పెట్టుకుని శ్రద్ధగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటిస్తున్నారని గమనించారు.
సుమారు 62శాతం మంది మహిళలు తాజా పళ్లను స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ ‘ఐపిఎస్‌ఓఎస్’ ఇటీవల 21- 45 ఏళ్ల మధ్య ఉన్న 3,055 మంది మహిళలను ఇంటర్‌వ్యూ చేసింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, జైపూర్, పుణే, భోపాల్, విశాఖపట్నం వంటి నగరాల్లో చేసిన సర్వేలో సహజ సిద్ధంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ వైపే మహిళలు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టమైంది. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది” అంటున్నారు ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్టు రితికా సమద్దార్. ఉద్యోగినులు తమ బ్యాగుల్లో ఆల్మండ్స్‌ను స్వల్పాహారంగా తీసుకెళుతున్నట్లు చెబుతున్నారు. ఇంట్లో చేసుకున్న ఆహారాన్నే తినటానికి ఇష్టపడుతున్నట్లు న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.