Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఇంట్లోకి దూసుకొచ్చిన లారీ: మహిళకు తీవ్రగాయాలు

ఇంట్లోకి దూసుకొచ్చిన లారీ: మహిళకు తీవ్రగాయాలు

Women Injured In Road Accident In Medchal District

మన తెలంగాణ/నాచారం; నిర్లక్షమైన డ్రైవింగ్ చేయటం తో ఆదుపు తప్పి ఒక ఇంట్లోకి కెమికల్ లారీ దూసుకెళ్లిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ లోని బీరప్పగడ్డ ప్రధాన రహదారి లో గంటేడీ గున్నయ్య,(62),అతని భార్య జి.సరస్వతి (54), నివాసముంటున్నారు. రోజు మాదిరి గానే ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్న సమయంలో మల్లాపూర్ ఎన్‌ఎఫ్‌సి ప్రధాన రోడ్డు మార్గం నుండి ,మాణక్‌చంద్ రోడ్డు గుండా ఎపి 31 టియు 2627 గల కెమికల్ లారీ సరాసరి రోడ్డు పై నుండి తమ ఇంట్లోకి దూసుకోచ్చిందని, లారీ వచ్చిన వేగానికి తమ ఇంటి గోడ కూలి తన భార్య సరస్వతి కి తీవ్ర గాయాలపాలైందని తెలిపినట్టు నాచారం పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్ధలానికి చేరుకొని గాయాలపాలైన సరస్వతిని చికిత్స కోరకు మల్లాపూర్ లోని అశ్రిత హస్పిటల్ కు తరలించచారు. అనంతరం లారీని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు నాచారం ఎస్ఐ రామయ్య తెలిపారు.