Home సినిమా శ్రీరెడ్డికి పెరుగుతన్న మద్దతు

శ్రీరెడ్డికి పెరుగుతన్న మద్దతు

Tollwood Actress Sri Reddy
Tollwood Actress Sri Reddy
Women JAC Supports to Actress Sri Reddy
Women JAC Supports to Actress Sri Reddy

హైదరాబాద్: నటి శ్రీరెడ్డికి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. మొన్న ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జెఎసి శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచారు. బుధవారం పలువురు సినీ పరిశ్రమలకు చెందిన మహిళా ఆర్టిస్టులు, మహిళా సంఘాల జెఎసి పూర్తి మద్దుతు తెలిపారు.
టాలీవుడ్ లో శ్రీరెడ్డితోపాటు వందలాదిమంది ఆర్టిస్టులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. సినిమాల్లో అవకాశాల కోసం మహిళలు లైంగిక వేధింపులకు గురి కావాల్సిరావడం దారుణమని మహిళా జెఎసి వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల నటి శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరిట వేధింపులు) ఆరోపణలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మహిళా జెఎసి ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశారు.
బుధవారం సినీ నటి అపూర్వ మీడియాతో మాట్లాడారు.. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) శ్రీరెడ్డిని బ్యాన్ చేయడం సరికాదన్నారు. ‘‘ మా’’ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న తమను అడగకుండానే ఆమెపై నిషేధం విధించారు. శ్రీరెడ్డిని ఈ విషయంపై సంప్రదించకుండానే, ఆమె అభిప్రాయం తీసుకోకుండానే బ్యాన్ చేయడం దారుణమన్నారు. అందుకే ‘మా’ నుండి బయటికొచ్చేశానని, సినీ పరిశ్రమ పూర్తిగా మారాల్సివుందని నటి అపూర్వ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా శ్రీరెడ్డికి న్యాయం చేయాలంటూ మహిళా జెఎసి వేదిక సభ్యులు మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. శ్రీరెడ్డి ఘటన తరువాత అనేకమంది బాధితులతో మాట్లాడి తెలుసుకున్నాం. చిన్న చిన్న పాత్రలకు కూడా లైంగిక ఒత్తిడికి మహిళలు, యువతులు గురి కావాల్సివస్తోంది. ఇలాంటి దారుణాలకు అరికెట్టేందుకు సినీ పరిశ్రమకు హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇండస్ట్రీలో క్యాష్ కమిటీ వెయ్యాలనీ, స్త్రీల మీద అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. సినీ రంగంలో పని చేస్తున్నవారి బాధలను తెలియపరిచేలా కమిటీని వేయాలని సూచించారు. అవుట్ డోర్ కు వెళ్లినప్పుడు మహిళలకు బాత్ రూంలు కూడా ఉండవని, అనేక విధాలుగా మహిళా ఆర్టిస్టులు అవమానానికి గురవుతున్నారని మహిళా జెఎసి మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.