Home జిల్లాలు కల్లు దొరక్క చెరువులోకి దూకిన మహిళ

కల్లు దొరక్క చెరువులోకి దూకిన మహిళ

మహిళను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

Untitled-1నాగర్‌కర్నూల్: మత్తుకల్లు మహత్యానికి ఇది మరో పరాకాష్ట. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(50) కల్లు తాగే అలవాటు ఉంది. కొద్ది రోజులుగా మందు కల్లు దొరకకపోవంతో పిచ్చిగా ప్రవర్తించడం మొదులుపెట్టింది. తనకు అదోలా అవుతుందని, తనను నాగర్‌కర్నూల్ చెరువు కట్టపై దర్గాదగ్గరకు తీసుకెళ్లాలని కోరింది. కొడుకు శ్రీను సోమవారం ఆమెను నాగర్‌కర్నూల్ చెరువుకట్టపై ఉన్న దర్గా దగ్గరకు తీసుకువచ్చి అక్కడ ఉన్న ఊదు పెట్టి కూర్చోబెట్టాడు. కొడుకు అటూ ఇటూ తిరుగుతుండగా లమ్మ పరిగెత్తి చెరువులోకి దూకింది. లబోదిబోమంటూ కొడుకు శ్రీను నిమజ్జనం విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సిబ్బందికి తెలిపారు. ఇంచార్జీ ఫైర్ ఆఫీసర్ అనంతరాములు, సిబ్బంది నాగరాజు చెరువులోకి వెళ్లి మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.