Home తాజా వార్తలు రైలు ఢీకొని మహిళ మృతి

రైలు ఢీకొని మహిళ మృతి

train-collapsedమెదక్: రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలం అక్కన్నపేటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతురాలు బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి పోచవ్వ(55)అనే మహిళ స్థానిక బిసి కాలనీ వద్ద రైలు వస్తున్నది గమనించిక ఆమె పట్టాలను దాటుతుండగా అకస్మాతుగా రైలు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈవిషయం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి చేరుకుని బోరున రోధిస్తున్నారు.