Search
Wednesday 26 September 2018
  • :
  • :

మహిళలు మహోన్నత శక్తులు

విశ్వకర్మమహిళ భవన నిర్మాణపనుల ప్రారంభోత్సవంలో ఎంఎల్‌ఎ దొంతి

MLA

నర్సంపేట: మహిళలు ఆర్థిక పరిపుష్టి కోసం సంఘాలను ఏర్పర్చుకొని మహోన్నత శక్తులుగా ఎదగాలని ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జిఓఎస్ కాలనీలో విశ్వకర్మ మహిళా సంఘం అద్యక్షురాలు ఇంద్రాల రజిత అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గతంలో కమ్యునిటీ హాల్ కోసం రూ.3లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సంఘ ఆర్దిక అవసరాల కోసం కంప్యూటర్‌తో పాటు ఆర్థిక సహాయం అందిస్తానని అన్నారు.

బ్యాంకు అధికారులతో మాట్లాడి ప్రతీ ఒక్కరు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు అందించే ఏర్పాటు చేస్తానని తెలిపాడు. అనంతరం నూతన భవన పనులు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్స్ పాలాయి శ్రీనివస్, చింతల సాంబరెడ్డి,పుల్లూరి సంధ్యస్వామిగౌడ్, పట్టణ, మండల పార్టి అద్యక్షులు పెండెం రామానంద్, బానోత్ లక్ష్మణ్ నాయక్, దేవోజు సదానందం, మధూకర్, సందీప్, కార్యవర్గ సభ్యులు, కవిత , రాణి, వసంత, సునిత, సరోజన, వనిత, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments