Home జాతీయ వార్తలు ఈవ్ టీజర్‌ను చితక్కొట్టిన మహిళా పోలీస్

ఈవ్ టీజర్‌ను చితక్కొట్టిన మహిళా పోలీస్

Police1పాట్నా: దేశంలో మహిళలపై దాడులు జరుగుతునే ఉన్నాయి. దేశంలో మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసిన మహిళలను వేధిస్తునే ఉన్నారు. బిహార్‌లో ఓ ఆటో డ్రైవర్ ఓ మహిళను వేదిస్తున్నాడు. ఇది చూసిన మహిళా పోలీస్ ఆటో డ్రైవర్‌ను మెడ పట్టుకొని జీపులోకి నెట్టింది. మహిళా పోలీస్ ఆటో డ్రైవర్‌పై అపరకాలికలా దూకి రెండు మూడు దెబ్బలు కొట్టింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈవ్‌టీజింగ్ అంటే కాలేజీలకు వరుకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఈవ్ టీజింగ్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. మహిళలకు ఎన్ని చట్టాలు చేసిన లైంగిక దాడుల మాత్రం ఆగడం లేదు. చట్టాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. మహిళలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనపై జరిగిన అన్యాయాలు గురించి చెప్పే స్థితిలో లేరు. ఎక్కడా అవమానం జరుగుతోందనే భయంలో బయటకు చెప్పలేక మహిళలు మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బయటకు వెళ్లితే మహిళల బాధలు వర్ణనాతీతంగా మారాయి.