Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

వివేకంతో ఎదుర్కోండిలా…

Woman-Working-Place

సంస్థలో వివాదాలనేవి సహజం. సహాద్యోగులతోనో, లేక ఇతరులతోనో ఎప్పుడో ఒకసారి వివాదాలు ఏర్పడక తప్పదు. వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎంత నేర్పుగా వ్యవహరించాలో తెలుసుకోవడం చాలా అవసరం.ఎక్కడైనా సరే ఒక పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం వెలువడ్డప్పుడు గానీ, ఒక పద్ధతిలో అనుకొని మార్పులు జరిగినప్పుడు గానీ, సంస్థ గురించి విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు గానీ వివాదాలు తెర మీదకొస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వాటి ప్రభావం సంస్థలో పనిచేసే ఉద్యోగుల మీద కూడా పడుతుంది. అలాంటి సందర్భంలో మనం వాటిని ఎదుర్కోవడంలో పూర్తి వివేకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.

విచక్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ఏదైనా వివాదం చెలరేగినప్పుడు పదే పదే మనం అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే, అది పనికి ప్రతిబంధకంగా మారుతుంది. అంతే కాదు, అలాంటి విషయాలు సంస్థ అభివృద్ధికి కూడా అడ్డంకిగానే నిలుస్తాయి. అందుకే, వివా దాలు, గొడవలు జరిగినా… పని వేళల్లో వాటి మీద చర్చలు పెట్టి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చకూడదు.కొన్ని వివాదాలను మర్చిపోదామనుకున్నా సహాద్యోగులు, స్నేహితులు మన దగ్గర వాటిని ప్రసావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో టాపిక్ మీద మాట్లాడటం ఇష్టం లేదని వారికి నిర్మొహమాటంగా చెప్పండి. వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిది.

ఈ క్రమంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు గానీ, పై అధికారులు మీ అభిప్రాయం అడిగినప్పుడు గానీ అభ్యంతరాలుంటే నిర్భయంగా చెప్పండి. అలాగే, ఏమైనా సూచనలు చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా కొందరు సంస్థ గురించి కొన్ని ప్రతికూలమైన విషయాలను ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో విచక్షణతో ఆలోచించాలి. అలాంటి వారితో జాగ్రత్తగా మెలగాలి. అంతేకానీ, కావాలని వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకూడదు.

Comments

comments