Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి…

Mirchi-Powder-Sample

కరీంనగర్ : ఓ మహిళ సర్వే చేస్తామంటూ ఇంటికొచ్చి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కంట్లో కారం కొట్టి  రెండున్నర తులాల గొలుసు అపహరించుకుపో యిన ఘటన ముస్తాబాద్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే.. కస్తూరి వెంకటరత్నమ్మ(60) ఇంటికి ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ సర్వే చేస్తున్నామంటూ వచ్చింది. ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలు తీసుకుంది. వృద్ధురాలు ఒంటరిగా ఉంటోందని గమనించి ఆమె కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కింద పడ్డ వెంకటరత్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పక్కింటి స్వరూప మహిళా దొంగను అడ్డుకోవడానికి యత్నించగా.. ఆమె పై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments