Search
Saturday 17 November 2018
  • :
  • :

అర్ధరాత్రీ..హాయిగా..

నగరంలో భద్రతతో కూడిన ప్రయాణం చేయాలంటే క్యాబ్ బుక్ చేసుకోవడం నేడు సర్వసాధారణమైంది. ఫోన్‌లో ఒక్క క్లిక్‌కు పదినిముషాల దూరంలో క్యాబ్ మనముందు ప్రత్యక్షమౌతుంది. నమ్మకంగా గమ్యానికి చేరుస్తుంది.  మహిళలు  ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మరింత భద్రత అవసరమవుతుంది.  అటువంటి సమయాల్లో మహిళా డ్రైవర్లతో కూడిన క్యాబ్‌లను కొన్ని నగరాల్లో  ప్రవేశపెట్టారు.   తమకంటూ ఓ ముద్ర వేసుకుని,  భద్రతే ధ్యేయంగా పనిచేస్తూ, గట్టి పోటీని ఎదుర్కొంటూ కూడా నిలదొక్కుకుంటూ మహిళా  ట్యాక్సీ సర్వీసులు దూసుకుపోతున్నాయి.

Women Cabs

షి ట్యాక్సీ, కేరళ

కేరళ రాష్ట్రంలోని కుటుంబాలు, విద్యార్థినులు, పర్యాటకులను షి ట్యాక్సీ సురక్షితంగా గమ్యానికి చేరుస్తుంది. తిరువనంతపురం, కొచ్చిలలో ప్రవేశపెట్టిన షీ ట్యాక్సీలు ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించాయి. రెయిన్ కన్‌సెర్ట్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యలో షి ట్యాక్సీలు నడుస్తున్నాయి. మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుంది. ఇరవైనాల్గుంటలూ అందుబాటులో ఉంటాయి షీ ట్యాక్సీలు. ఇప్పుడు మహిళా డ్రైవర్లు ఉన్న మిగతా క్యాబ్‌లకు షి ట్యాక్సీలకు గట్టి పోటీ ఉన్నా, ఎన్నో అవార్డులను గెలుచుకుని విజయవంతంగా నడుస్తోంది. 918590000543 ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ప్రియదర్శిని టాక్సీ సర్వీస్, ముంబయి

రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త అయిన సుశీబెన్ షా ప్రియదర్శిని ట్యాక్సీ సర్సీసును నడుపుతున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతతోపాటు వారికి జీవనోపాధి కల్పించడానికి నడుంబిగించారు.  ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగాలను కల్పించారు. ముంబయి నగరంలో పింక్ షర్ట్‌లను ధరించి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్‌తో  అనేక మంది మహిళా డ్రైవర్లు కనిపిస్తుంటారు. ప్రతిరోజు ప్రియదర్శిని ట్యాక్సీలో ప్రయాణించేవారికి, వృద్ధులకు  ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది.  www. priyadarshinitaxi.com అనే వెబ్‌సైట్ లేదా  912243333999 ఫోన్ ద్వారా ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు.

షి క్యాబ్, హైదరాబాద్

2015లో తెలంగాణ ప్రభుత్వం పది క్యాబ్‌లతో షి క్యాబ్‌ను ప్రారంభించింది. మహిళా డ్రైవర్లను పైలట్ అని పిలుస్తారు. నగరంలో పనిచేసే ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని షి క్యాబ్‌ను ఏర్పాటేచేసింది. విజయవంతంగా నడుస్తోంది. 919515105101 నంబర్‌లో బుక్ చేసుకోవచ్చు.

విమెన్ క్యాబ్స్, బెంగళూరు

రోజి టు రోటి (R2R) వెంచర్ల ఆధ్వర్యంలో నడుస్తోంది బెంగళూరులోని విమెన్‌క్యాబ్. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాబ్స్‌ను ఏర్పాటుచేశారు. మహిళా డ్రైవర్ల డ్రెస్ కోడ్ నల్లని టీ షర్ట్. 918069000100/7022978507. www.womencabs.com వెబ్‌సైట్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.

Comments

comments