Home తాజా వార్తలు భారత్ ఘన విజయం

భారత్ ఘన విజయం

india

ఆసియాకప్ టి20
కౌలాలంపూర్: ఆసియాకప్ టి20 టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. దాంతో టోర్నీలో మూడో విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. భారత విజయంలో మిథాలీ రాజ్(23), హర్మన్‌ప్రీత్ కౌర్(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్), అనుజా పటేల్( 19 నాటౌట్)లు తమ వంతు సాయం అందించారు. అంతకు ముందు లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో యశోదా మెండిస్(27), హసిని పెరీరా(46 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా, గోస్వామి, అనుజా పటేల్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు.