Home తాజా వార్తలు ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్, టివిలపై భారీ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్, టివిలపై భారీ డిస్కౌంట్

Flipkartహైదరాబాద్: ఉమెన్స్ డే సంద‌ర్భంగా ఇ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో శుక్రవారం ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టివిల వంటి వ‌స్తువుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ XR కేవ‌లం రూ.67,999 ధ‌ర‌కే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే గూగుల్ పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ రూ.37,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 రూ.30,990 ధ‌ర‌కు, అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ (8జిబి, 256 జిబి) రూ.28,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

అలాగే ఎల్‌జి, మోటోరోలా, షియోమీ, నోకియా, హాన‌ర్ కి చెందిన స్మార్ట్ ఫోన్ల‌ను కూడా చాలా త‌క్కువ ధ‌ర‌కే ఈ సేల్ ఉన్నాయి. అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను రూ.50,990 ప్రారంభ ధ‌ర‌కు లభిస్తున్నాయి. ఈ క్ర‌మంలో హెడ్‌ఫోన్స్‌, స్పీక‌ర్ల‌పై 70 శాతం వ‌ర‌కు, స్మార్ట్‌హోమ్ డివైస్‌ల‌పై 75 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. అలాగే ప‌లు ఉత్ప‌త్తులపై నో కాస్ట్ ఇఎంఐ స‌దుపాయాన్ని కూడా అందుబాటులో ఉంది.

Womens day full discount sale on flipkart