Home తాజా వార్తలు మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళల ధర్నా..

మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళల ధర్నా..

Womens dharna on Telangana Nagar issues

భద్రాద్రి కొత్తగూడెం: పట్టణ పరిధి తెలంగాణ నగర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమీషనర్ షఫీఉల్లాకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. కాలనీలో పారిశుద్యం, త్రాగునీరు, రహదారుల సమస్యలు నానాటికి తీవ్రంగా తరమవుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని గత్యంతరం లేకే ఆందోళన బాట పట్టామన్నారు. గత కొన్ని నెలలుగా కాలనీకి నీరందించే పైప్‌లైన్ మరమ్మత్తులకు గురైనా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. సమస్యపై స్పందించిన కమీషనర్ పైప్‌లైన్ మరమ్మత్తులు చేపట్టి సాధ్యమైనంత త్వరలో నీరందిస్తామని తెలిపారు. అప్పటి వరకు రోజుకు రెండు సార్లు మున్సిపల్ ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ముగిసింది.

Womens dharna on Telangana Nagar issues in City