Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కివీస్‌తో భారత్ తొలి పోరు

india

దుబాయి : విండీస్ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ షెడ్యూల్డ్‌ను ఐసిసి ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించాయి. గ్రూప్‌ఎలో ఆతిథ్య విండీస్, ఇంగ్లం డ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, గ్రూప్‌బిలో భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు చోటు కల్పించారు. భారత్ తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 9న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో నవంబర్ 11న దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది. న వంబర్ 15న క్వాలిఫయర్2తో ఢీకొంటుంది. నవంబర్ 17న చివ రి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. కాగా, ఈ టోర్నమెంట్ కు సంబంధించిన 9, 10 స్థానాల కోసం జులైలో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ అర్హత టోర్నీ ద్వారా రెండు జట్లను ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారు.  ఇదిలావుండగా ప్రపంచకప్‌కు సంబంధించిన రెండు సెమీఫైనల్ మ్యా చ్‌లు ఒకే రోజు జరుగుతాయి. నవంబర్ 22న సెమీస్ సమరం జరుగుతుంది. కాగా, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 24న జరుగనుంది. అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోరు నిర్వహిస్తారు. ఫైనల్‌కు రిజర్వ్‌డేను కూడా ప్రకటించారు. ఒకవేళ 24న ఫైనల్ సాధ్యంకాక పోతే తర్వాతి రోజు నిర్వహించాలని నిర్ణయించారు.

Comments

comments