Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రైతుల అభ్యున్నతికి కృషి

Govardan-image

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

మన తెలంగాణ/కామారెడ్డి : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని కామారెడ్డి ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఎంతో ఆసరాగా నిలిచారన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కామారెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి వ్యవసాయ కమిటీ చైర్మన్ గట్టగోని గోపిగౌడ్, వైస్ చైర్మన్‌గా గౌరీశంకర్, భిక్కనూరు వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ సువర్ణ అమృతారెడ్డి, వైస్ చైర్మన్‌గా కుంచాల శేఖర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయన్నారు. రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో ఉండిపోతుందని, దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అట్టి పథకానికి సంబంధించిన బీమా డబ్బులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి బక్కి వెంకటయ్య, డిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments