Home తాజా వార్తలు ప్రజలు మెచ్చే విధంగా పని చేయండి : డిజిపి

ప్రజలు మెచ్చే విధంగా పని చేయండి : డిజిపి

DGP

వరంగల్ : ప్రజలు మెచ్చే విధంగా పని చేయాలని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డిజిపి మహేందర్‌రెడ్డి గురువారం మహబూబాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో సమీక్ష చేశారు. మహబూబాబాద్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పోలీసుల పనితీరుతో తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని ఆయన పోలీసులకు సూచించారు. హన్మకొండ మోడల్ పోలీసు స్టేషన్‌ను, పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్న పోలీసు కమాండ్ సెంటర్‌ను డిజిపి పరిశీలించారు.

Work for People : DGP