Home నాగర్ కర్నూల్ మైనార్టీల సంక్షేమానికి కృషి

మైనార్టీల సంక్షేమానికి కృషి

Work for the welfare of minorities

ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ 

మన తెలంగాణ/అచ్చంపేట: మనిషి జన్మించిన నాటినుండి చనిపోయిన తర్వాత సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మనిషికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని 10, 18 వార్డులలో పేద ముస్లిం మైనార్టీలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మెన్ బందంరాజు, కౌన్సిలర్ గోపిషెట్టి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ ల బాల్‌రాజ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ మనోహర్, మున్సిపల్ ఛైర్మెన్ తులసీరాం, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మ గౌడ్‌లు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఒకే రకంగా చూస్తూ వారికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. మనిషి పుట్టినప్పుడు కేసీఆర్ కిట్‌తో పాటు చని పోయిన అనంతరం జీవిత బీమాతో ప్రభుత్వం మనిషి జీవితానికి భరోసా కల్పించిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమ లు చేయడంతో పాటు ఎన్నికలలో హామీ ఇవ్వని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 2019 ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసాయని, తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో పాటు పడుతుందన్నారు. అనంతరం మారుతీ నగర్ కాలనీలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, మహిళలు ఎమ్మె ల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నేతలు బాల్‌రాజ్, రత్నమ్మ, నీడ్స్‌బాబ, రహమ త్, అన్వర్, మంజూర్, కిషోర్,  తదితరులు పాల్గొన్నారు.