Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సాంబారులో తుమ్మ ముళ్లు…

Workers do not give food even clean

సింగరేణి:  సింగరేణిలోని క్యాంటీన్‌లను ఆధునీకరిస్తాం, చక్కటి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని అందిస్తామని చెబుతున్న యాజమాన్యం ఇచ్చే ఆహారాన్ని సైతం శుభ్రంగా ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. తాజాగా ఆర్‌జి2 డివిజన్ పరిధిలోని ఓసిపి3 ప్రాజెక్టు బేస్‌వర్క్‌షాప్‌లో ఉదయం సాంబారు ఇడ్లిలు కార్మికులకు అందించారు. ఒక కార్మికునికి పెద్ద తుమ్మ ముళ్లు సాంబారులో ప్రత్యక్షమైంది. ఒకవేళ చూడకుండా తింటే తమ పరిస్థితి ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన చక్కటి ఆహారాన్ని అందించలేని సంక్షేమాధికారులు కనీసం ఇచ్చే పదార్థాలను సైతం శుభ్రంగా ఇవ్వడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబారులో వచ్చిన ముళ్లును బేస్‌వర్క్‌షాప్ హెడ్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. కొద్ది సేపు కార్మికులు ఆందోళన చేసి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments