Search
Sunday 18 November 2018
  • :
  • :

నేడు సమ్మెలోకి కార్మికులు

Strike

మన తెలంగాణ, రంగారెడ్డి : దేశ వ్యాప్తంగా స్కీం వర్కర్‌లు నిర్వహించనున్న సమ్మెతో జిల్లాలో పలు సేవలకు అంతరాయం కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టి అందులో కాంట్రాక్టు కార్మికులను తీసుకుని సేవలు చేయించు కోవడం తప్ప వారికి జీతాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు క్రమబద్దీకరణ చేయకపోవడంపై నిరసనగా దేశ వ్యాప్తంగా సిఐటియూ అనుబంధ సంఘాలు జనవరి 20 న సమ్మె నిర్వహిస్తు న్నాయి. మద్యాహ్న భోజన కార్మికులతో పాటు అంగన్‌వాడి, ఆషా, రెండవ ఎ.ఎన్.ఎమ్‌లు, ఇందిర క్రాంతి పథకం, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌లోకి కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కార్మికులు సైతం సమ్మె భాట పట్టనున్నారు.

రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దాదాపు రెండు లక్షల మంది వరకు సమ్మె భాట పటనుండటంతో పలు సేవలకు అంతరాయం కలుగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనం స్తంబించి విద్యార్దులు ఇక్కట్ల పాలవడం ఖాయం. ప్రభుత్వ బడులలో మద్యాహ్న భోజన కార్మికులు ఒక్కరోజు సమ్మెకు సిద్దం కావడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేసిన ఎంతవరకు ఫలితాలు వస్తాయన్న నమ్మకం కనిపించడం లేదు. ప్రతి పాఠశాలలో మద్యాహ్న భోజనం విద్యార్దులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీచేసిన వారు మాత్రం ఎమి చేయలేని నిస్సాహయ స్థీతిలో కనిపిస్తున్నారు.

ఇతర ప్రభుత్వ శాఖలు మాత్రం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వం స్కీం కార్మికులను తక్షణం క్రమబద్దికరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి భూపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హంగు ఆర్బాటాలకు ప్రాధాన్యత ఇస్తుంది తప్ప కార్మికుల జీవితాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. సేవల పేరుతో కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. స్కీం బడ్జెట్‌లో కోతలు పెడుతు ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడానికి సిద్దం అవుతున్నతీరును ఆక్షేపించారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 20న దర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Comments

comments