Home సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేస్తోంది!

అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేస్తోంది!

Aditi-Rao-Hydareహైదరాబాదీ అమ్మాయే అయినా అదితిరావు హైదరి ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తమిళ్‌లో అరకొర సినిమాలు చేసినా బాలీవుడ్‌లో మాత్రం ఎనిమిదేళ్లుగా అదరగొడుతుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు ఓ తమిళ సినిమా చేస్తోంది. బాలీవుడ్ నుంచి మళ్లీ కోలీవుడ్‌పై అమ్మడి కన్ను పడడానికి అసలు కారణం ఈ చిత్రం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతుండడమే. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా వర్క్ చేస్తోందట అదితి. ఇన్నేళ్ల కెరీర్‌లో నటనలో ఎన్నో నేర్చుకున్నా… ఈ భామకు ఫిల్మ్‌మేకింగ్ అంటే మక్కువ అని తెలిసింది. అందుకే అవకాశం రాగానే మణిరత్నం మూవీలో హీరోయిన్‌గా అంగీకరించేసి అదే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవతారం ఎత్తేసింది. ఒకవైపు కార్తీకి హీరోయిన్‌గా నటిస్తూ.. మరోవైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ఆనందాన్ని పొందుతోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో సుధీర్ మిశ్రా తీస్తున్న ‘ఔర్ దేవదాస్’, సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘పద్మావతి’ మూవీలో నటిస్తోంది అదితిరావు హైదరి.