Home కరీంనగర్ పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకం

పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకం

Working for the creation of the diary in the siricilla

సిరిసిల్లలో డెయిరీకి ఏర్పాటుకు కృషి                                                                                                                      కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్

మనతెలంగాణ/కరీంనగర్‌: కరీంనగర్ మిల్క్ ప్రొ డ్యూసర్‌కంపెనీలోని ప్రతిపాల ఉత్పత్తిదారునికి ప్రభు త్వం నుండి లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమా ర్ అన్నారు. గురువారం నగరంలోని కరీంనగర్ డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పాలఉత్పత్తి దారులకు 2017 సెప్టెంబర్ నుండి ఈ పథకంను వర్తింపు చేయుటకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
పాలు పోసిన పాడి రైతుకు ప్రోత్సాహకాన్ని వారి బ్యాంకు అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుందన్నారు. అందుకు గాను 37 వేల 321 మంది రైతులకు 9కోట్ల 7 లక్షల 40 వేల 583 రూపాయలను ఈ నెల జమ చేయడం జరుగుతుందన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన పాల డెయిరీని ఏర్పాటు చేయుటకు కృషి చేయ డం జరుగుతుందని తెలిపారు. డెయిరీ ఏర్పాటు కోసం 63 కోట్ల 6 లక్షల రూపాయలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో సబ్సిడీ 10 కోట్లు లోను 40 కోట్ల 40 లక్షలు, కంపెనీ షేర్ 12.61 లక్షలు ఉంటుందన్నారు. డెయిరీ నిర్మాణం కోసం వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో 60 ఎకరాల భూమిని లీజుకు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు.డెయిరీ చైర్మన్ చల్మె డ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు నాలు గు రూపాయలు ప్రో త్సాహం అందించిన ప్రభుత్వానికి, కృ షి చేసిన మంత్రి ఈ టల రాజేందర్‌కు, ఎంపి వినోద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎండి వెంకట్‌రెడ్డి, గౌరవ సలహాదారు హన్మంతరావు పాల్గొన్నారు.