Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మత్సకారుల సంక్షేమానికి కృషి:మంత్రి జూపల్లి

mike

* రేమద్దుల గ్రామంలో
రూ.10లక్షల నిధులతో నిర్మాణం
* వచ్చే జనవరి నెల నుంచి
వ్యవసాయానికి 24 గంటల
విద్యుత్ సరఫరా: మంత్రి జూపల్లి

మన తెలంగాణ/పాన్‌గల్ : రాష్ట్రంలో గత ప్రభుత్వా లు ఎన్నడు చేయని విధంగా మత్సకారుల సంక్షే మం కోసం తెలంగాణ  ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి  జూ పల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దుల గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మిం చిన మత్సకారుల పారిశ్రామిక సహకార నూతన భ వనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లా డారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీ య పథకం మత్సకారులకు  ఉపయోగపడిందన్నారు. మత్సకారులు ఆర్థికంగా ఎదగడానికి సొసైటి ద్వా రా రాయితీతో ద్విచక్ర వాహనాలు, బొలెరొ వాహనా లు,  చేపలు పట్టేందుకు బోట్లు, వలలను పంపిణి చే యడం జరుగుతుందన్నారు. రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నంత కాలం మత్సకారులను బిసి బి నుండి బిసి ఎలోకి మార్చేందుకు తాను స్వయంగా సిఎంతో మా ట్లాడి బిసి కమీషన్ వేయించడం జరిగిందన్నారు. గడి చిన మూడున్నర ఏళ్ల కాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరానికి,గుంటాకు, సాగునీరందించేందుకు కృషి చేశామన్నారు. వచ్చే మార్చి నెల వరకు రైతుల పొలాలకు సాగునీరందు తుందని రైతులు అపోహపడకుండా పంటలను సాగు చేసుకోవాలని మంత్రి భరోసా ఇచ్చారు.భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం ఇప్పిస్తామ ని మంత్రి హామీ ఇచ్చారు.  గ్రామాల్లోని ప్రతి కుటుం బానికి ఏదో విధంగా కుటుంబాలకు లబ్ధ్ది చేకూరు తుందన్నారు. వచ్చే జనవరి నుండి పూర్తి స్థాయిలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందజేస్తా మన్నారు.గ్రామాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిం చేందుకు జనవరిలో మిషన్ భగీరథ పథకం వేగవం తం చేస్తున్నామన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్నారు. రేమద్దుల  మత్సకార సహకార సంఘం అభివృద్ధికి మరో రూ. 10లక్షల ని ధులను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  రాంచంద్రారెడ్డి,జడ్పిటిసి కేతేపల్లి రవి,ఎంపిపి వెంక టేష్‌నాయుడు, తిరుపతయ్య సాగర్, సర్పంచ్ నాగ మ్మ,సంఘం అధ్యక్షులు రాములు, భా స్కర్, గౌ.సల హాదారులు రాములు , నిరంజన్, చంద్ర య్య, గోపా ల్‌రావు, యాదగిరి రెడ్డి, కతాల్ పాల్గొన్నారు.

Comments

comments