Home తాజా వార్తలు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

harish-rao

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదర్శ్‌నగర్‌లో  టీయూడబ్ల్యూజే  రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సమాజం కోసం జర్నలిస్టులు అహర్నిశలు పాటుపడుతున్నారని ఆయన కొనియాడారు. జర్నలిస్టుల కోసం వంద కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘతన తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లకా్ష్మ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, డిజిపి అనురాగ్‌శర్మ, సిపి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Working for the Welfare of Journalists