Home జిల్లాలు మైనార్టీల సంక్షేమానికి సర్కారు కృషి

మైనార్టీల సంక్షేమానికి సర్కారు కృషి

ramzan* జూలై 1న మెదక్‌లో ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభం
* ముస్లింలకు అవసరం అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
* ముస్లింల కష్టం.. నా కష్టంగా భావిస్తా
* నిరుపేద ముస్లింలకు దుస్తుల పంపిణీ
* ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ : ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, రిజర్వేషన్ ల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన దుస్తువుల పంపిణి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నికి మున్సిపల్ చైర్మెన్ మల్లికార్జున్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ రాగి అశోక్, మెదక్ జడ్పీటీసి లావణ్యరెడ్డి కౌన్సిలర్‌లు అరునార్తి రమణ, సోహేల్, రబిన్ దివాకర్, మేడి మధుసూదన్ రావు, సలాం, విజయలక్ష్మి, జెల్ల గాయత్రి, బట్టి సులోచన, గడ్డమీది యశోద, మెదక్ టిఆర్‌ఎస్ నాయకులు ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సాధిక్, పట్టణ అధ్యక్షులు మందుగుల గంగాధర్, మున్నా, మత పెద్దలు ఆరీప్, మౌలానసాబ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లీం మహిళలకు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విద్యాభివృద్ధి తోనే కుటుంభం, దేశాభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నాడని ఆమె కొనియాడారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం 120 మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు ఆమె వివరించారు. కాగా మెదక్ పట్టణంలో జూలై 1వ తేదీన ముస్లింల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సమైక్యాంధ్ర పాలనలో ముస్లింలకు అడుగ డుగునా అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ముస్లీంల అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని ఆమె అన్నారు. వివాహా విషయంలో ముస్లీంలకు కూడా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి యాభైఒక్క వెయ్యి రూపాయలు చెల్లిస్తు న్నట్లు ఆమె తెలిపారు. ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ముఖ్యమంత్రి కేసిఆర్ 3900 కోట్లు మంజూరు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవతరించాక ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వమే దుస్తువులు, ఇఫ్తార్ వింద్‌లు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మైనార్టీలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఇష్టంతో వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.