Home తాజా వార్తలు వర్షంతో నిలిచిన మ్యాచ్… 49 ఓవర్లలో ఆసీస్ 368/5

వర్షంతో నిలిచిన మ్యాచ్… 49 ఓవర్లలో ఆసీస్ 368/5

 

నాటింగ్‌హామ్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 368 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే, ఈ దశలో వర్షం పడడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టుకు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని అందించారు. డేవిడ్ వార్నర్(166) అద్భుత సెంచరీతో చెలరేగగా, ఆరోన్ ఫించ్(53) పరుగులతో రాణించాడు.

వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం సౌమ్య సర్కార్ బౌలింగ్ లో ఫించ్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చినా ఉస్మాన్ ఖవాజా(89)తో కలిసి వార్నర్ బంగ్లా బౌలర్లపై మరింత విరుచుకుపడుతున్నాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. చివర్లో మాక్స్ వెల్(32) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.  ప్రస్తుతం క్రీజులో స్టోయినిస్(6), కారే(9)లు ఉన్నారు.

 World Cup 2019: AUS vs BNG delayed due to rain