Home తాజా వార్తలు శిఖర్ ధావన్ శతకం…

శిఖర్ ధావన్ శతకం…

 World Cup

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 246 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ధావన్ 117 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో లయాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ 57 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటైన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా 15 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్, నీల్ చెరో వికెట్ తీశారు.

 

World Cup 2019: Shikhar Dhawan Century in IND v AUS