Home తాజా వార్తలు భారత్‌దే ప్రపంచకప్ సచిన్ జోస్యం

భారత్‌దే ప్రపంచకప్ సచిన్ జోస్యం

Sachin Tendulkarన్యూఢిల్లీ : ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పాడు. క్రికెట్ విశ్లేషకులంతా ఈ సారి ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల పేర్లను చెప్తుంటే సచిన్ టీమిండియాకే ట్రోఫీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ముంబైలోని ఎంఐజీ మైదానంలో సచిన్ పేరుతో పెవిలియన్ ఎండ్‌ను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.

ఈ ప్రపంచకప్ పూర్తి వేసవిలో జరగనుంది. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉం టుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. ఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో భారీ మార్పులు జరిగితే తప్ప పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తాయనడంలో సందే హం లేదు. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్ అంద రూ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే పరిణామంగా చెప్పొచ్చు.

కోహ్లి, రోహిత్, ధావన్, రాహు ల్, హార్దిక్, ధోని తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక వీరంతా ఐపిఎల్‌లో నిలకడగా రాణించడం జట్టుకు కలిసి వచ్చే అంశ మే. ఇక, బుమ్రా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీనికి తోడు ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ప్రపంచకప్‌ను గెలవడం భారత్‌కు కష్టం కాదని సచిన్ స్పష్టం చేశాడు.

World Cup is coming to India says Sachin