Home ఆఫ్ బీట్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే

మన ఆరోగ్యం మన చేతుల్లోనే

దురలవాట్లు దూరం చేసుకుంటే దీర్ఘాయుష్షుమన సొంతం
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై ప్రత్యేక కథనం

World-Health-Day

మన తెలంగాణ/సిటీబ్యూరో : నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న నగర వాసులు ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ముప్పై ఏళ్లకే అనారోగ్యం, నలభై దాటితే రోజూ మందులు మింగడం, యుక్త వయసులోనే డయాబెటిస్, బిపి, నానాటికీ పెరుగుతోన్న క్యాన్సర్ బాధితు లు, పౌష్టికాహారం అందక చిన్నారుల అవస్థలు.

ఇదీ నగరంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి. పెరుగుతున్న కా లుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏంచేయాలి? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటున్నారు వైద్యులు. మా తాతకు తొంభై ఏళ్లు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడురా… ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటాడు తెలుసా? ఇలాంటి మాటలు అక్కడక్కడా ఇప్పటికీ వినిపిస్తుంటాయ్. మరి ఇప్పుడు చూస్తే..! ఇరవై ఏళ్లు దాటినవారిలో కొందరు కింద పడ్డ వస్తువును కూడా వంగి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుత కాలం లో ఇదీ మన ఆరోగ్య పరిస్థితి. ఆ రోజుల్లో బలవర్థకమైన ఆహారం తినేవారు. స్వచ్ఛమైన ఆకుకూరలు, కాయకూరలు, వీటికి తోడు చిరు ధాన్యాలు ఎక్కువగా ఉపయోగించేవారు. దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉం డేది. అందుకే ఎలాంటి రోగాలు లేకుండా అప్పటివా రు బలంగా ఉండేవారు. ఎనభై ఏళ్ల వయసులోనూ చ లాకీగా తిరుగుతూ తమ పనులు తాము చేసుకునేవా రు. కానీ ప్రస్తుతం చూస్తే నిల్చుంటే లేవలేం.. లేస్తే కూర్చోలేని పరిస్థితి. కాలుష్య వాతావరణం, ఆహారపు అలవాట్లలో మార్పులు, వీటితోపాటు ప్రధానంగా శా రీరక శ్రమ లేకపోవడంతో ముప్పై ఏళ్లకే యువత ము సలి వాళ్లుగా మారడంతో పాటు పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, బీపిలు సమాజాన్ని హడలెత్తిస్తున్నాయి.

దురలవాట్లకు బానిస : పాశ్చాత్య పోకడల మోజు కూడా ప్రాణాల మీదికి తెస్తోంది. చిన్నతనంలోనే యువత దురలవాట్లకు బానిసవుతోంది. ఇక తిండి విషయానికొస్తే పిజ్జాలు, బర్గర్లు అంటూ క్షణం ఖాళీ లేకుండా లాగించేస్తున్నారు నగరవాసులు. సమయపాలన అనేది ఎక్కడా కనిపించడంలేదు. ఇదే ఆరోగ్యానికి ప్రధానంగా పొగపెడుతోంది. ఇక ఊబకాయం గురించి చెప్పాల్సిన అవసరంలేదు. దీనివల్ల మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. వీటికి తోడు మరిన్ని రోగాలు వచ్చి చేరుతున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటివి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దోమల కారణంగా వచ్చే రోగాలు శరీరాన్నే కాదు..! జేబుల్ని గుల్ల చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం డెంగ్యూ బారిన పడే వారి సంఖ్య క్రమంగా ఎక్కువైందని తేలింది.

మన చేతుల్లోనే మన ఆరోగ్యం : ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఒంటికి మేలు చేసే మితాహారం తీసుకోవడం, శారీరక శ్రమ కల్పించడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లను దూరం చేసుకోవడం దీర్ఘాయుష్షును పొందవచ్చన్నది అందరికీ తెలిసిందే. కానీ ఆచరణలోనే విఫలమవుతున్నాం. నేడు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇవాల్టీ నుంచైనా దురలవాట్లను దూరం చేసుకొని మంచి అలవాట్లకు శ్రీకారం చుట్టండి. ఆరోగ్యంగా జీవించండి.