Home రాష్ట్ర వార్తలు పారిశ్రామిక  పండుగకు సిటీ సింగారం

పారిశ్రామిక  పండుగకు సిటీ సింగారం

hyd

తెలంగాణ కట్టు, బొట్టుతో స్వాగతం

 హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు విచ్చేస్తున్న దేశ, విదేశాల అతిథులకు మర్యాదపూర్వక స్వాగతం పలికేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే లా కట్టుబొట్టుతో అతిథులకు స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయంలో అతిథులు దిగిన వెం టనే వారికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగులతో పాటు పర్యాటక, ఆతిథ్య నిర్వహణ జాతీయ సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, నిథిమ్)కు చెందిన 300 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. పలు విషయాలలో విద్యార్థులను పరీక్షించిన తర్వాత ఎం పిక చేసిన 300 మంది నుంచి 60 మందిని విమానాశ్రయంలో వినియోగించుకోనున్నారు. వీరు అదే పని కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి నియమించబడ్డ ఉద్యోగుల సమన్వయం తో స్వాగతం పలుకనున్నారు. ఉద్యోగులు, విద్యార్థులతో కూడిన మొత్తం సిబ్బంది మూడు బృందాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నా రు. విమానాశ్రయంలో సదస్సుకు విచ్చేసే స్వదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు ఒక బృందా న్ని డొమెస్టిక్ టెర్మినల్‌లో, విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు మరో బృందాన్ని ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో, లాబీలో ఇంకో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలోనూ షిప్టుల వారీగా మూడు షిప్టులుగా వీరు అతిథుల కు స్వాగతం పలకనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో సదస్సు జరగనున్న నేపథ్యంలో వీరం తా 26వ తేదీ నుంచి (సదస్సు ప్రారంభానికి 2 రోజుల ముందు నుంచి) డిసెంబర్ 2 వరకు (సదస్సు ముగిశాక రెండు రోజుల వరకు) విమానాశ్రయంలో షిఫ్టుల వారీగా స్వాగతం పలకడం మొదలు వెళ్లిపోయేంత వరకు విధులు నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక వారసత్వం ఉట్టిపడేలా విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో స్వాగత వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతిథులకు స్వాగతం పలికాక వారు సదస్సు వేదిక (హెచ్‌ఐసిసి) వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాహనం వరకు తోడుగా వెళ్లి పంపించనున్నారు. అక్కడ నుంచి వారిని రవాణా కమిటీ నిర్దేశించిన వాహనాల్లో వేదిక వద్దకు తీసుకెళ్లనున్నారు. సదస్సు సందర్భంగా బస చేసే హోటల్స్‌లలో  పర్యాటకాభివృద్ధి సంస్థ తరపున ఉద్యోగులు అతిథులు కోరితే వివిధ పర్యాటక ప్రదేశాల విశేషాలను వారికి వివరించనున్నారు. సదస్సు ముందు లేదా తర్వాత అతిథులు ఆశించి ఏదైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే వెంటనే అందుకోసం కూడా సిద్ధమౌతున్నారు. గోల్కొండలో 3 రోజులు ప్రవేశం నిషేధం : దాదాపు 1400 మంది అతిథులు గోల్కొండ కోటను 29న సందర్శించనున్న నేపథ్యంలో రోజువారీ మూడు రోజుల పాటు ప్రవేశాన్ని నిషేధించారు. నిర్మల్ బొమ్మలు, బిద్రీ, కళంకారీ హస్తకళాకృతులతో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పోచంపల్లి, గద్వాల్, కొత్తకోట డిజైన్స్‌కు కూడా వీటిలో స్థానం లభించనుంది. యుఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ స్టాల్స్‌ను సందర్శిస్తారని అధికారులు అంచనాల్లో ఉన్నారు. గోల్కొండ కోట ప్రవేశంలో డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు.  విదేశీ అతిథులు ఖాళీ సమయంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటే వారి కోసం ఇప్పటికే 10 ప్యాకేజీలను సిద్ధం చేసి పెట్టినట్టు టిఎస్‌టిడిసి ఎండి క్రీస్టీనా చొంగ్తూ తెలిపారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడాలను కవర్ చేసే చారిత్రక యాత్ర, రామోజీ ఫిలిం సిటీ, వివిధ ప్రార్థనా మందిరాలను దర్శించేలా దైవదర్శనం, నగరానికి చేరువలోని గ్రామాలను సందర్శించేలా గ్రామీణ పర్యాటకం, మహానగర సందర్శన, చేతి వృత్తులు, సాంస్కృతిక ప్రదేశాల కవర్ చేసే ప్యాకేజీ, గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో తదితర ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు, జనవరిలో సైన్సు కాంగ్రెస్, ఫిబ్రవరిలో ప్రపంచ ఐటి సదస్సు ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వచ్చే అతిథులను పర్యాటకం వైపు ఆకర్షించాలని భావిస్తున్నారు.