Home ఎడిటోరియల్ పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు

పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు

World Kidney Day

 

ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, సంవత్సరానికి రెండున్నర కోట్లమంది కిడ్నీ వ్యాధులతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి. నికరగ్వా, శ్రీలంకల తర్వాత భారతదేశంలోనే అత్యధిక మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దానం, కనిగిరి, తిరువూరు పరిసర ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు.

షుగర్, బి.పి.లు నియంత్రణలో లేకపోవడం, మద్యపానం, ధూమపానం, కలుషిత నీరు త్రాగుడం, ఒబెసిటీ తదితర కారణాల వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆకలి మందగించడం, వాంతులు అవుతున్నట్లు అన్పించడం, మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం, నీరసంగా ఉండి క్రమేణా బరువు తగ్గడం, ఆయాసంగా ఉండటం, శరీరం పాలిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు ఈ వ్యాధుల బారిన పడిన వారిలో కన్పిస్తాయి. శరీరంలో రెండు విభిన్న వ్యాధుల కారణంగా కిడ్నీ పనిచేయకపోతే “ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్‌” అని, చాలా రకాల కారణాల వల్ల కిడ్నీ పనిచేసే సామర్ధ్యాన్ని క్రమేపీ కోల్పోతే “క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌” అని పిలుస్తారు. కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారిలో ఎక్కువమంది గిరిజనులు, పేదవారే ఉంటున్నారు.

నిరక్ష్యరాస్యత, అమాయకత్వం, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోవ డం, నాటు మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా కిడ్నీ సంబంధిత వ్యా ధులు పెరుగుతున్నాయి. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదకరమైనది. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్‌ని మందులతో లేదా కొంతకాలం పాటు డయాలసిస్ ద్వారా తగ్గించవచ్చు.కొందరిలో వంశపారంపర్యంగా కూడా కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు వున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కిడ్నీ వ్యాధులను నియంత్రించడానికి మందులు వాడకంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువైతే “హిమోడయాలసిస్‌”, “వాటర్ డయాలసిస్‌” వంటి పద్ధతుల ద్వారా కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తారు. కిడ్నీ మార్పిడి కూడా ఒక పరిష్కార మార్గమే. చనిపోయిన వారి నుండి కూడా కిడ్నీ తీసి కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులకు పెట్టవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి 14న వరల్డ్ కిడ్నీ డే గా జరుపుతారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ సంబంధిత రోగులకు పెన్షన్ సౌకర్యము కూడా మంజూరు చేస్తుంది. అయితే డయాలసిస్ సెంటర్స్ ఎక్కువగా జిల్లా కేంద్రాలలో ఉండటంతో మారుమూల ప్రాంతాలలో వున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ర్టం లోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు రోజు, రోజుకూ పెరుగుతున్నారు. మనిషి ప్రాణం తీసే అత్యంత ప్రమాదకర వ్యాధిగా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి మారుతుంది. నియోజకవర్గ కేంద్రాలలో డయాలసిస్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం, రోగుల తీవ్రతను బట్టి గాకుండా ప్రతి కిడ్నీ బాధితుడుకి పెన్షన్ మంజూరు చేయడం, జనరిక్ మందుల షాపులలో కిడ్నీ వ్యాధి నివారణ మందులు అందుబాటులో వుంచడం, నెఫ్రాలజిస్టులను ప్రభుత్వం పెద ్దసంఖ్యలో నియమించడం, ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆహార అలవాట్లు మార్చుకోవడం, సరైన వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీ వ్యాధులని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది.

World Kidney Day on March 14