Home తాజా వార్తలు ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ…

ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ…

World Malaria Day

 

భువనగిరి : ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో జరిగిన అవగాహణ సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం యొక్క నినాదం “ మలేరియా రహిత సమాజం నాతోనే ప్రారంభం” కావున సమాజంలో ప్రతి ఒక్కరు భాద్యతగా మలేరియా నిర్మూళనకు కృషి చేయాలన్నారు.

అదేవిధంగా ప్రతి శుక్రవారం పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దీనిలో బాగంగా ప్రతి ఇంటిలో నిల్వ ఉండే నీటి వనరులను పారబోసి కడిగి తిరిగి నీళ్ళు నింపుకోవాలని తెలిపారు. గ్రామాలలో ఇండ్ల చుట్టు ప్రక్కల మరియు మురికి కాల్వలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే మలేరియా మరణాలు తగ్గించాలంటే దోమలు పుట్టకుండా చేయడమేనని, దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి మదుమోహన్‌రావు, డాక్టర్ లీలావతి, వి.అంజయ్య, జిల్లా మాస్ మీడియా అధికారి సబ్ యూనిట్ అధికారులు వెంకన్న తాడూరి, రవిచందర్, ప్రవీన్, సాలమన్, గుండెల్లి ఇస్తారి, సాయిరెడ్డి, ఆరోగ్య విద్యా బోదకులు పాల్గొన్నారు.

 

World Malaria Day Rally