Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచ కురువృద్ధురాలు మృతి

ప్రపంచ కురువృద్ధురాలు మృతి

oldest-women-in-worldన్యూయార్క్: ప్రపంచంలో అత్యంత వయస్సు మళ్లిన ముసలి ఆవిడ మరణించింది. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ముసాత్ జోన్స్ (116) అనారోగ్య కారణంగా మృతి చెందింది. ఈమె దక్షిణ అమెరికాలోని అలబామాలో 1899లో జన్మించింది. చదువు ముగిసిన తరువాత ఉత్తర అమెరికాకు చేరుకుంది. గిన్నీస్‌బుక్‌లో వృద్ధ మహిళగా చోటు సంపాదించింది. ఎక్కు వ సంవత్సరాలు బ్రతకడానికి కారణాలు ఏంటని అడిగితే తాను బాగా నిద్రపోతానని చెప్పేది జోన్స్. పొగ, మద్యానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈమె మరణించటంతో ఈమె పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు ఇటలీ మహిళ మారనో మార్తినుజి (116)కి వెళ్లింది.