Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అసోం టీ ప్రపంచ రికార్డు

వేలంలో కిలో రూ. 39,001

assam-Tea

గౌహతి : అసోంకి చెందిన ఓ టీ రకం అమ్మకంలో ప్రపంచ చరిత్ర సృష్టించింది. గౌహతి టీ వేలం కేంద్రంలో ఏకంగా కిలో టీ ధర  రూ. 39,001లు పలికింది. టీని వేలం వేసినప్పుడు  గౌహతిలోని సౌరబ్ టీ వ్యాపారులకు అమ్మడానికి  బ్రోకర్లు 39 వేల  1 రూపాయి పాట పలికి కిలో టీని సొంతం చేసుకున్నారు. దీన్ని ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని తమ కస్టమర్లకు అమ్ముతారు.  మనోహరి గోల్డెన్ టీగా పిలిచే ఈ టీని మనోహరి టీ ఎస్టేట్ వారు ఉత్పత్తి చేస్తారు. వేలం పాటలో ప్రపంచ రికార్డు సృష్టించిన టీ విషయాన్ని టి బోర్డు ఆఫ్ ఇండియా, అసోం చీఫ్ మినిష్టర్ సర్బానంద సోనోవాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

Comments

comments