Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం

Valantine-Day

నస్పూర్: ఇద్దరి కులాలు వేరు. అయినా వారు ఒక్కటయ్యారు.. పెద్దల నుంచి అందరిలాగే తిరాస్కారం… అయినా పట్టువదలకుండా ఒక్కటయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం దూరంగా ఉంటున్న అబ్బాయి తల్లిదండ్రుల చెంతనే ఉంటూ వారి ప్రేమను దక్కించుకుని ఆదర్శంగా నిలుస్తూ జీవనం సాగిస్తు న్నారు… ఈ ప్రేమ .జంట విజయగాధ ఇది… నస్పూర్ మండలంలోని ఆర్‌కె-6 కాలనీకి చె ందిన పోడేటి పరుశురాం -శ్రీలక్ష్మి చిన్ననాటి మిత్రులు, ఇద్దరి ఇళ్ల మధ్య దూరం ఒక చిన్నగోడ మాత్ర మే… చదువుకున్న నాటి నుండి స్నేహితులు కావ డంతో ఇద్దరి మధ్య ఎంతో చనువు ఏర్ప డింది.

సంతోషాలు,.. కష్టాలు .. పొకరికొక్కరు పంచుకున్నారు. అర్థం చేసుకున్నారు. అయితే వీరి మధ్య ఉన్న స్నేహ బంధంలో ఒక్కసారి ప్రేమ అనే బీజం నాటు కుంది. అంతే ఏంటి అని ఆలోచించలేదు. వారి మధ్య చిగురించిన ప్రేమ ఇంతింతై వంటుదింతై అన్న చందంగా ఒకరికొకరూ వదిలి ఉండలేని పరిస్థితి అంతే… నిత్యం ఒకరికోకరూ కలుసుకోకుండా ఉండలేకపోయారు. వీరి మధ్య సాగుతున్న ప్రేమ ఇటు పరుశురాం అటు శ్రీ లక్ష్మి తల్లిదండ్రులకు తెలిసిపో యింది. పరుశురాం తల్లిదండ్రులు మొదట్లో కొంత వారించినా ఇద్దరి చిన్న మనసులను నొప్పించకుండా సరే అనేశారు. కానీ లక్ష్మి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు దూరం పె ట్టారు. ఆరు సంవత్సరాలుగా వీరి ప్రేమ వ్యవహారం సాగగా 2006లో పరుశురాం లక్ష్మిలకు తల్లిదండ్రులు, స్నేహితులు కలసి వీరి వివాహాన్ని ఘనంగా చేశారు.

అంచెలంచలుగా ఎదుగుతూ
Lover-2అయితే అప్పటి వరకు చదువు సాగించిన పరుశురాం వీడియోగ్రఫీ రంగంలోకి దిగి వివాహాది శుభకార్యాలకు వీడియో తీస్తూ సంపాదననా మార్గాన్ని ఎంచుకున్నాడు. నలుగురికి ఉపాధి కలిపిస్తూతాను వీడియోతో పాటు పోటోలు కూడా తీయడం మొదలు పె ట్టాడు. అంతేకాదు ఇటు ఫొటో, వీడియోగ్రాఫర్‌గా రాణిస్తూ చిన్నగా ఎస్‌టీడీ, జిరాక్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో చిన్న దుకాణం పెట్టాడు. అంతేకాదు. పత్రికా విలేకరిగా కూడా పని చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో విలేకరిగా పని చేస్తూనే జర్నలిజం చేసి కోల్‌బెల్టు ఏరియాలో తనకంటూ ప్రత్యేకతను కనబరుస్తూ వివిధ కథనాలు రాస్తూ అందరి చేతా శేభాశ్ అనిపించుకుంటున్నాడు. ఇటీవల ఉత్తమ విలేకరిగా కూడా అవార్డు అందుకున్నాడు
ముల్కల్ల రవికుమార్- సహజబేగం(సమత)

Lover3ముల్కల్ల రవికుమార్ – సహజబేగంలు వీరు ఇద్దరు చిన్ననాటి నుండి శ్రీరాంపూర్ కాలనీలో ఉండేవారు. పాఠశాల స్థాయి నుండి వీరి ఇద్దరి మధ్య విడదీయని స్నేహం ఏర్పడింది. దీనికి తోడు వారిద్దరు క్రీడాకారులు కావడంతో చదువుతో పాటు క్రీడాల్లో ముందుడేవారు. ఈ క్రమంలో వారిలో ప్రేమ బీజం మొదలై ఏప్రిల్ 2016న ప్రేమవివాహం చేసుకొని ఒక్కటైనారు.
తోట రాజేష్-సృజన

మందమర్రి కి చెందిన తోట రాజేష్, పె ద్దంపేటకు చెందిన సృజన ఇద్దరు విప్లవ భావాలు కలిగిన వ్యక్తులు వీరు సిపిఐ న్యూడెమోక్రసీ పార్టీలో 2007 నుండి క్రీయా శీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పార్టీకి సంబంధించి ఏకార్యక్రమైన వీరు తప్పకుండా హజరువుతూ ముందుండేవారు ఒకరికొకరు వదిలి ఉండలేక ఎటు వెళ్లి న కలసికట్టుగా వెల్లేవారు. అ క్రమంలో వీరి మధ్య ప్రేమ కుదిరింది. వీరి ప్రేమను సిపిఐ న్యూడెమోక్రసీ పార్టీ పెద్దలకు చెప్పడంతో 29 నవంబర్ 2009న వీరికి వివా హం చేశారు. వీరు సంతోషంగాగా జీవనం కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

Comments

comments