Home అంతర్జాతీయ వార్తలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు పుట్టి నేటికి 30 సంవత్సరాలు

డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు పుట్టి నేటికి 30 సంవత్సరాలు

 

WWW

 

లండన్: 30వ వసంతంలోకి వరల్డ్ వైడ్ వెబ్ అడుగుపెట్టింది. వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగోని ఇవాళ్టికి 30 సంవత్సరాలు కావడంతో డూడుల్ తో  గూగుల్ సంబరాలు చేసుకుంది.  1989 మార్చి 12న కంప్యూటర్ సైంటిస్టు టిమ్ బెర్నర్ లీ వరల్డ్ వైడ్ వెబ్ ను సృష్టించాడు.  స్విట్జర్ లాండ్ లో బెర్నర్ తన సంస్థలో సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో ఇబ్బంది పడేవారు. దీంతో ఎలాగైనా ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటన్ సమాచారం ఎలా షేర్ చేయాలని దానిపై ఎప్పుడు ఆలోచించేవాడు. దీంతో హైపర్ టెక్ట్స్ మార్క్ ఆప్ లాంగ్వేజ్, యునిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్ సహాయంతో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు కనిపెట్టి కంప్యూటర్లకు అనుసంధానం చేసి ‘మెష్’ సందేశాన్ని పంపాడు.   అంతర్జాలంలో మోసాయిక్ అనే సెర్చ్ ఇంజన్ ను 1993లో తీసుకొచ్చారు. మోసాయిక్ స్థానంలో ఇంటర్ నెట్ ఎక్స్ ఫ్లోరర్, గూగుల్ క్రోమ్, మోజిల్ల ఫైర్ పాక్స్ అనే సెర్చ్ ఇంజన్లు వాడుకలోకి వచ్చాయి.   

 

WWW