Search
Friday 21 September 2018
  • :
  • :

రోబో లాయర్ ‘రాస్’

World’s first robot lawyer ROSS hired by US law firm

ప్రపంచంలోనే మొట్టమొదటి ‘రోబో లాయర్’ అమెరికాలోని న్యాయవాద సంస్థల్లో న్యాయ పరిశోధనల్లో లాయర్లకు ఇప్పుడు సహకరిస్తోంది. ఈ రోబో లాయర్ పేరు ‘రాస్’. పరిశోధనాత్మక ప్రశ్న ఏదైనా సరే టక్కున సమాధానం చెబుతుంది. సాక్షాలను సేకరిస్తుంది. దీనికి సంబంధించిన ఉదంతాలు ఏవైనా లా పుస్తకాల్లో ఉంటే గుర్తు చేస్తుంది. ఆ పుస్తకాలు చదవకుండానే వివరాలు అందిస్తుంది. ఇవన్నీ క్షణాల్లోనే జరుగుతాయి. అత్యంత ఆధునికమైన ఈ రోబో లా పుస్తకాల్లోని న్యాయ నిబంధనల ప్రకారం కేసుల వాదనకు తగినట్టు వివరాలను అందించడమే కాదు చదువుతుంది కూడా. సరైన సలహాలు అందిస్తుంది. 24 గంటలూ కేసులను పరిశీలిస్తూ కోర్టుల్లో కొత్తగా ఇచ్చిన తీర్పులను సమీక్షిస్తుంది. ఆయా కేసులకు తగ్గట్టు సమాధానాలు, సలహాలు అందిస్తూ ప్రభావితం చేస్తుంది. వాట్సన్, ఐబిఎంకు సంబంధించిన కాగ్నెటిక్ కంప్యూటర్ ఆధారంగా ఈ ‘లాయర్ రోబో’ను రూపకల్పన చేశారు. అమెరికాకు చెందిన న్యాయసంస్థ ‘బేకర్ హాస్టట్లెక్’ దీని వినియోగానికి లైసెన్సు జారీ చేసే బాధ్యత చేపట్టింది. దివాలా తీసిన సంస్థలు తిరిగి కోలుకోడానికి, విశ్వసనీయమైన రుణదాతలను ఎంపిక చేసుకోడానికి ఈ రోబో ఉపయోగపడుతోంది. ఆ సంస్థ వారు పదినెలల్లోనే ‘బ్యాంక్ప్ట్రసీ లా’ను బోధించే సామర్థాన్ని పొంగలిగారు. ‘రాస్’ విజ్ఞాన సంస్థే ఈ ‘రోబోరాస్’ను రూపొందించింది. టోరంటో యూనివర్శిటీ 2014లో ‘రాస్’ పరిశోధనను ప్రారంభించింది.

Comments

comments