Home తాజా వార్తలు బుల్లి వజ్రాల దొంగ…

బుల్లి వజ్రాల దొంగ…

Worlds Smallest Diamond Thief

హైదరాబాద్: సాధారణంగా చీమలు తమ శరీర బరువు కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను కూడా అవి మోయగలవు . ఎక్కడెక్కడో ఉన్న ఆహారాన్ని వాటి స్థావరాలకు తెచ్చుకోవాలంటే ఆమాత్రం బలం ఉండాలి. మరి ఇలాంటి చీమే ఒకటి ఆభరణాల షాపులోకి దూరింది.  అక్కడ ఉన్న చిన్న చిన్న వజ్రాలను చూసి తినుబండారం అనుకొని ఓ చిన్న వజ్రాన్ని అతి కష్టం మీద తన స్థావరానికి తీసుకెళ్తూ కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు రూ. 10 లక్షల విలువైన వజ్రాన్ని ఈ చీమ దొంగతనం చేసింది.