Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హత విధీ.. ఏమీ వారధి..

  • ప్రమాద భరితంగా గోదావరి బ్రిడ్జీ
  • వంతెన మధ్యలో పెద్ద పెద్ద గోతులు,
  • కనిపిస్తున్న ఊచలు
  • పట్టించుకోని అధికారులు

Damaged-Bridge

భద్రాచలం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి భక్తులను చేరవేసే వారధి ప్రమాద భరితంగా మారింది. ఎక్కడ చూసిన బ్రిడ్జీపై పెచ్చులు లేచిపోయి గోతులు మయంగా మారింది. గోదావరి నదిపై ఉన్న ఈ బ్రిడ్జీని ముంబయ్‌కి చెందిన ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణం చేసింది. అప్పట్లో రాముల వారి దర్శనార్థం వచ్చే భక్తులు నది దాటుతూ పెద్ద ఎత్తున చనిపోవడంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఎన్నో ఏళ్లుగా భయంకర గోదావరి వరదలను సైతం తట్టుకుని నిలబడ్డ ఈ బ్రిడ్జీ ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. బ్రిడ్జీ మధ్య మధ్యలో పెద్ద పెద్ద పగళ్లు తేలాయి, ఊచలు బయటపడ్డాయి. సిమెంట్ పెచ్చులు లేచాయి. పెచ్చులు లేచిన దగ్గర నుల్చుని క్రిందికి చూస్చే పిల్లర్లు సైతం కనిపిస్తున్నాయి. వాహనాలు తిరగడానికి కూడా ఇబ్బందిగా మారింది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత అధ్వాన్నం. జరగరాని ప్రమాదం జరిగి ద్విచక్ర వాహనాలు ఆ గుంతల్లో పడి తిరగపడితే గోదావరిలోనికి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇంత ప్రమాద భరితంగా మారినప్పటికీ దానిని పట్టించుకునేందుకు సంబంధిత అధికారులు ముందుకు రాకపోవడంతో శోచనీయం. రెండో వారధి నిర్మాణ పనులు సాగుతున్న తరుణంలో ఈ వంతెనను చిన్నచూపు చూడటం సరైంది కాదని, నిత్యం ఇక్కడికి వచ్చి పోతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి సీతారామ్ నాయక్ దీనిపై దృష్టి సారిస్తే బాగుండేదని పలువురు బాహాటంగానే అంటున్నారు. మరో కోద్ది రోజుల్లో శ్రీ రామ నవమి వేడుక ఉన్న తరుణంలో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల దీనిపై దృష్టి సారించాలని రామ భక్తులు కోరుతున్నారు.

Comments

comments