Home జగిత్యాల దయనీయంగా డ్రైవరన్నల బతుకులు

దయనీయంగా డ్రైవరన్నల బతుకులు

Driver

మనతెలంగాణ/కోరుట్ల రూరల్: ఇంటి నుండి బయలుదేరి రోజుల తరబడి దూర ప్రాంతాలకు వెల్లి జాగ్రత్తగా తిరిగోస్తరనే నమ్మకం లేని బతుకులు డ్రైవరన్నలవి. జాగ్రత్తగా వాహానం నడిపి గమ్యం చేరాలని హితవు పలికే వారు అధికంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి అపరాత్రుల్లో సైతం లారీలు, కార్లు, వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, ఆటోలు నడుతు జీవనం సాగించే రథసారథుల బతుకులు అద్వానంగా మారాయి. ఉన్నత చదువులేకనో, పేదరిక కుటుంబంలో జన్మించో డ్రైవర్ గా పని చేసేవారు అధిక సంఖ్యల్లో ఉన్నారు. కొద్ది పాటి జీత భత్యాలతో కుటుంబాలను పోషించుకుంటు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెల్లే డ్రైవర్ల బాదలు ఆ భగవంతుడికే తెలియాలి. వరుస ప్రయాణలతో డ్రైవరన్నలు విలవిల లాడుతున్న కనికరించని ఓనర్ల తీరు మాత్రం ధనమే ప్రాయాం అనే విధంగా ఉంటున్నాయి. అద్దె కార్లలో విదేశాలకు వెల్లే వారిని(ఏయర్‌పోర్ట్) కు చేర్చే వారు అరిగోసలు పడుతున్నారు.

*అడ్వాన్స్‌లిచ్చి బెదిరిస్తున్న వాహాన ఓనర్లు…
వరుస ప్రయాణలతో అలిసిపోయిన ఒక్కరోజు కూడా విశ్రాంతి నివ్వకుండా నిత్యం అద్దెలుంటాయి విశ్రాంతి తీసువడం కుదరదంటు,వెల్లాలనే హుకుంలు జారీచేస్తు ధనమే ద్యేయంగా మెదిలే ఓనర్ల తీరులతో అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బులు తిరిగివ్వలేక తంటాలు పడుతున్న డ్రైవర్ల బతుకులను ఆ దేవుడే చూడాలి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలతో నిద్దుర కోసం కనురెప్పలు కాకవికలమైన జాగ్రత్త ప్రయాణికులను గమ్యం చేర్చితీరాల్సిందేగ. ఆకలితో అలమటిస్తు కొద్ది పాటి భత్యంతో కుటుంబాలను పోషించాలని క్షణంపాటు నిర్లక్షంగా వ్వవహరించిన పెను ప్రమాదం జరిగే విధంగా రథసారథుల బతుకులు కొనసాగుతున్నాయి. అవసరాన్ని ఆసరాగా చేసుకోనే కొందరి వాహన ఓనర్లు మాత్రం డ్రైవర్ కూడ మనిషేకదా అని మరుస్తు బెంబేలెత్తిస్తుంటారు. గంటల పాటు ప్రాయాణంలో నిదురిస్తున్నావారే అలసి పోతే క్షణం కూడా కన్ను మూయక దారిపై ఎదురుగా వస్తున్న వాహానాల జోరుకు జంకుతూ జాగ్రత్తలు పడే వారిపై ధన అహంకార ధోరణిలు చూపడం ఎంతవరకు సమంజసమో. పనివారి పట్ల కాస్తైన కనికరం లేకుండా విసుకెత్తే విధంగా బెదిరింపులకు గురిచేసే వారు తస్మత్ జాగ్రత్త మీ జీవం కూడా డ్రైవర్ల చేతిలోనే ఉంటాయి.
ని మరుస్తే ఎలా..