Search
Wednesday 21 November 2018
  • :
  • :

మలుపులు కావివి… మృత్యుద్వారాలు

Road-Corners

మన తెలంగాణ/తలమడుగు: మండలంలో అనేక చోట్ల రోడ్లపై ఉన్న మూల మలుపులు మృత్యు ద్వారాలుగా తయారవుతున్నాయి. రోడ్లపై ఇరువైపుల చెట్లు అల్లుకుపోయి అనేక ప్రమాదాలు జరుగు తున్నాయి. అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఎక్కడ కూడా అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో అవీ ఇటు ప్రయాణికులకు, అటూవాహన చోదకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మండలంలోని ప్రధాన రహదారులపై ఎక్కడ చూసి ఇరువైపుల తుమ్మచెట్లు అల్లుకుని మూల మాలుపుల దగ్గర ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికి మరోకటి కనిపించకుండా నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరగమే కాకండా తీవ్రగాయాలతో మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మూల ములుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్షం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాత్రివేల ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ప్రయాణికులు, వాహన చొదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం మత్తులో ఉండి అధిక లోడ్ అజాగ్రతగా డ్రైవింగ్ చేయడం కూడా రోడ్డు ప్రయాదాలకు ప్రధాన కారణమని అంటున్నారు.

మండలం లోని ఉండం గ్రామం వద్ద అదే గ్రామానికి ముస్తాఫా అనే వ్యక్తికి రోడ్డుపై మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న ఆటో ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి. ఇలా చాలా మంది బాదితులు మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయి వీగత జీవులుగా మారడమే కాకుండా మృత్యువాత పడ్డవారున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూల మలుపులు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చెట్లను నరికించాలని కోరుతున్నారు.

Comments

comments