Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఉమెన్ వరల్డ్ కప్: కష్టాల్లో ఇంగ్లాండ్

Goswami

లార్డ్స్: వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగుతున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ తడబడుతోంది. 164 పరుగులకే కీలక ఆరు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ జులన్ గోస్వామి 3 వికెట్లతో విజృంభించడంతో ఆతిథ్య జట్టు ఆపదలో పడింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్లలో స్కివర్(51), టేలర్(45), విన్ ఫీయిల్డ్(24), బిమాంట్(23), నైట్(1), విల్సన్(0) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3, పాండే 2, గైక్వాడ్ ఒక వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో బ్రంట్(24), గున్(2) ఉండగా… ఇంగ్లాండ్ స్కోర్: 181/6(43 ఓవర్లు).

WWC 2017 Final: England Women vs India Women, England lost six wickets.

Comments

comments