Search
Wednesday 21 November 2018
  • :
  • :

త్వరలో మార్కెట్‌లోకి షియోమి ఎంఐ5

Xiaomi-Mi-5హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 5ని ఈ నెల 31వ తేదీన గురువారం భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 4 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ముందు చెప్పిన మోడల్స్ ప్రకారం రూ.21వేలు, రూ.24వేలు, రూ.28వేల ధరలకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి రానుంది.

షియోమీ ఎంఐ 5 ఫీచర్లు…

  • డ్యుయల్ సిమ్, 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 3డీ సెరామిక్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
  • అడ్రినో 530 గ్రాఫిక్స్
  • 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 4 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • క్వాల్‌కామ్ క్విక్‌చార్జ్ 3.0, యూఎస్‌బీ ఓటీజీ

Comments

comments