Home తాజా వార్తలు షియోమీ నుంచి ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్…

షియోమీ నుంచి ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్…

xiaomi mi a2 launching tomorrow

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ2 ను గత కొద్ది రోజుల కిందట స్పెయిన్ మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను అమ్మకానికి ఉంచనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,500 గా ఉండనున్నట్టు సమాచారం.

షియోమీ ఎంఐ ఎ2 అద్భుత ఫీచర్లు…

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి ఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0

డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.