Home టెక్ ట్రెండ్స్ ‘షావోమీ ఎంఐ ఎ2’పై భారీ తగ్గింపు

‘షావోమీ ఎంఐ ఎ2’పై భారీ తగ్గింపు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారుదారు షావోమీ భారత్‌లో తన స్మార్ట్ ఫోన్ షావోమీ ఎంఐ ఎ2 ధరను భారీగా తగ్గించింది.  గతేడాది ఆగస్టులో ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్ లోకి విడుదలైంది. దీని అసలు ధర రూ.16,999 ఉండగా.. నవంబరులో 1000 రూపాయలు తగ్గించారు. ఇప్పుడు మరోసారి భారీగా ధరను తగ్గించి రూ.13,999 చేశారు. 4 జిబి ర్యామ్/64 జిబి స్టోరేజి, 6జిబి ర్యామ్/128 జిబి వేరియంట్లు రెండింటిపైనా ధరను తగ్గించినట్టు కంపెనీ పేర్కొంది.
ఫీచర్స్:
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్లు
12+20 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
20 ఎంపి సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,000 ఎంఎహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు తదితర ఫీచర్స్ ఉన్నాయి.
Xiaomi MI 2 price decreased