Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అల్ట్రాసోనిక్ టూత్‌బ్రష్

Xiaomi-Mi-Ultrasonic-Toothb

చైనాకు చెందిన మొబైల్స్ తయారుదారు షియోమీ కంపెనీ నూతన ఎంఐ ఆల్ట్రాసోనిక్ టూత్‌బ్రష్‌ను తయారుచేసింది. దీంట్లో ఆల్ట్రాసో నిక్ టెక్నాలజీ ఉంది. ఈ బ్రష్ నిముషానికి 31వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. దీంతో దంతాలు త్వరగా సులువుగా శుభ్రం అవుతాయి. దీంట్లోని బ్రిజిల్స్‌ను పలు రకాలుగా మార్చుకోవచ్చు. అందుకు గాను స్మార్ట్‌ఫోన్ యాప్ ఉపయోగపడుతుంది.

ఈ బ్రష్‌ను బ్లూటూత్, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకునే బ్రిజిల్స్ ఆకారం, సైజును యూజర్లు తమకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఇంకా ఈ బ్రష్‌కు ఐపీఎక్స్ 7 వాటర్‌ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంది. 700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చింది కంపెనీ. ఒకసారి మొత్తం చార్జింగ్ చేస్తే 18 రోజుల వరకు దీన్ని ఉపయోగించవచ్చు.

Comments

comments