ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ షియోమీ తన రెడ్మీ నోట్ 5, రెడ్మీ 5 ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్డేట్ను త్వరలో లాంచ్ చేయబోతుంది. ఇది వరకే ఎంఐ మిక్స్ 2, ఎంఐ 6, రెడ్మీ వై2 ఫోన్లకు గాను ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్డేట్ను షియోమీ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో రెడ్మీ నోట్ 5, రెడ్మీ 5 ఫోన్లతోపాటు రెడ్మీ నోట్ 5 ప్రొ, రెడ్మీ నోట్ 4, ఎంఐ 5, రెడ్మీ వై1 ఫోన్లకు కూడా కొత్త ఆండ్రాయిడ్ ఒఎస్ అప్డేట్ను ప్రవేశపెట్టబోతుంది. సదరు నూతన ఒఎస్ అప్డేట్ను షియోమీ ప్రస్తుతం పరీక్షిస్తోంది.