Search
Wednesday 14 November 2018
  • :
  • :

షియోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

Xiaomi released Android One Mi A2 phones

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీ కంపెనీ ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ లను స్పెయిన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆగష్టు 8వ తేదీన ఎంఐ ఎ2ని మాత్రమే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు షియోమీ సంస్థ యాజమాని మను కుమార్ జైన్ వెల్లడించారు. ఆకట్టుకునే ఫీచర్లతో 3/4జిబి తోపాటు 6జిబి వేరియంట్లలో ఎంఐ ఎ2 ఫోన్ ని రిలీజ్ చేశారు.

3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,000 కాగా… 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,500లకు వినియోగదారులకు లభిస్తోంది. అలాగే 6జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.28,100లకు అందుబాటులో ఉంది. కాగా, ఇండియాలో ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ పై  సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

షియోమీ ఎంఐ ఎ2 అద్భుత ఫీచర్లు…

5.99″ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6జిబి ర్యామ్, 32/64/128జిబి ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 12/20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3010ఎంఏహెచ్ బ్యాటరీ

Comments

comments