Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఇండియాలో షియోమీ హ్యాట్రిక్‌!

Redmi-4

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ తాజాగా ప్రవేశపెట్టి రెడ్‌మీ 4 ఫోన్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే 2.5 లక్షల ఫోన్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. భారత్‌లో ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌లో నేడు రెడ్‌మీ 4 తొలి అమ్మకాలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు ఈ ఫోన్‌ విక్రయాలు చేపట్టగా కేవలం 8 నిమిషాల్లోనే 2.5లక్షల రెడ్‌మీ ఫోన్లు విక్రయమైనట్లు షియోమీ పేర్కొంది. ‘రెడ్‌మీ 4 సేల్‌తో భారత్‌లో హ్యాట్రిక్‌ సాధించాం’ అని షియోమీ ట్విటర్లో తెలిపింది. రెడ్‌మీ నోట్ 4 ఫోన్లు… 10 నిమిషాల్లో 2.5లక్షల ఫోన్లు సేల్‌ అయ్యాయి. రెడ్‌మీ 4ఎ ఫోన్లు 4 నిమిషాల్లో 2.5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. తాజాగా రెడ్‌మీ 4 కూడా ఎనిమిది నిమిషాల్లో 2.5లక్షల ఫోన్లు అమ్ముడ కావడంపై షియోమీ హర్షం వ్యక్తం చేసింది.

Comments

comments