Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

షియోమీ సూపర్ ఆఫర్.. రూపాయికే ఫోన్లు

xiaomi-phonesన్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమీ భారత్‌లో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి కావస్తోన్న సందర్భంగా వినియోగదారులకు సూపర్ ఆఫర్ అందిస్తోంది. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జులై 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఫ్లాష్ డీల్స్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా కేవలం ఒక్క రూపాయికే ఫోన్లు, పవర్‌బ్యాంక్‌లు లాంటి వస్తువులను ఇవ్వనుంది. తొలి రోజు 10 షియోమీ ఎంఐ 5 ఫోన్లు, 100 పవర్‌బ్యాంకులు, రెండో రోజు 10 రెడ్‌మీ నోట్3 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్‌లు, చివరి రోజున 10 ఎంఐ మ్యాక్స్ ఫోన్లు, 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను ఫ్లాష్‌సేల్‌కు ఉంచింది. ఇందుకోసం యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లాష్‌సేల్ ఉంటుందని సంస్థ తెలిపింది. జులై 19లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేస్తామని షియోమీ పేర్కొంది. కాగా, షియోమీ 2014 జూన్‌లో ఎంఐ3 ఫోన్‌ను విడుదల చేసి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే 30 లక్షల మొబైల్స్‌ను విక్రయించడం విశేషం.

Comments

comments